బుధవారం 28 జూలై 2010

సిరివెన్నెల సాహిత్యం

నాకు స్పూర్థినిచ్చే వాటిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలంనుంచి జాలువారిన ఈ సాహిత్యం కూడా ఒకటి.

దీన్ని యూట్యూబ్ లోంచి డౌన్ లోడ్ చేసి స్నేహితుడొకరు పేపర్ పై రాస్తే, సిస్టంలో టైప్ చేసి ఇక్కడ ఉంచుతున్నాను.

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి...

ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం...

విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయంరా...

|ఎప్పుడూ|

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వపిల్ల

రెక్కముందు తక్కువేనురా! |2|

సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేపపిల్ల

మొప్పముందు చిన్నదేనురా!

పశ్చిమాన పొంచిఉంది రవిని మింగు అసురసంధ్య

ఒక్కనాడు నెగ్గలేదురా!

గుటకపడని అగ్నిగుండ సాగరాలనీదుకుంటు తూర్పు

ఇంట చేరుతుందిరా!

నిషావిలాసమెంతసేపురా? ఉషోదయాన్ని ఎవ్వడాపురా?

రగులుతున్న గుండెకూడ సూర్యగోళమంటిదేనురా!

| ఎప్పుడూ|

నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన |2|

జీవితాన అడుగు అడుగునా!

నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీదికాదు

బ్రతుకు అంటె నిత్యఘర్షణ!

దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది

ఇంతకన్న సైన్యముండునా? |2|

ఆశనీకు అస్త్రమౌను, శ్వాసనీకు శస్త్రమౌను

ఆశయమ్ము సారథౌనురా! |2|

నిరంతరం ప్రయత్నముండగా, నిరాశకే నిరాశ పుట్టదా?

ఆయువంటూ ఉన్నవరకు చావుకూడ నెగ్గలేక

శవంపైన గెలుపు చాటురా!

| ఎప్పుడూ|