ఒక చిన్న ఆశ...
జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తూ...
ఒక చిన్న ఊహ..
మనోఫలకాన్ని మదిస్తూ..
జ్ఞాపకాలకి రెక్కల్ని తగిలిస్తూ,
అనంతమైన భావాలకు రూపకల్పన చేస్తూ..
విభిన్న సాంద్రతల భావోద్వోగాల్ని
అప్పటికప్పుడు సృజిస్తూ.
మనసుని స్పృశిస్తూ.
స్వప్నమేన్నటికి నిజం కాదని.
నిజాన్ని స్వప్నం లా చూడొద్దని
హితవు చెబ్తూ అనుభవాల్ని
పాటంచేసుకుని ముందుకే
వెళ్ళాలని.. చంచల భావాలతో
ఊయలూగే మనసుని కేంద్రీకృతం చేసి
జాగ్రుతిలో మెలగాలని
అలసటని, బడలికనీ సుషుప్తిలో
సమాధి చేయాలని
స్పూర్తినిస్తున్నాయ్
0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి