మంగళవారం 18 మే 2010

విరహం ఇదేనా?

మధువనం నాటి
మది స్వరం మీటి
నువు ఎటేల్లేవు ఓ ప్రేమా...?

ఎద తలుపు తాకి
చిరు వలపు చిలికి
నను స్పృసించావు ఓ ప్రేమా....!

వలపు తగిలి గాయలైతే
తలపు తేనె రాస్తున్నా
మనసు పగిలి శిథిలాలైతే
కన్నీటితో జత చేస్తున్నా
చెరిగిపడిన హృదయ సీమపై
కలత నిదుర కథలై ఉంటే
జ్ఞాపకాల చేవ్రాలుతో
దస్తూరి చేస్తున్నా
కలం కదిలి కవితే రాస్తే
గరళం ఐనా మింగేస్తున్నా

మనసు వీణ మీటబోతే
జ్ఞాపకమే కాటేస్తుందే

నడి నిశీధి విషాదమల్లె
నీ కొరకే వేచి ఉన్నా...

7 వ్యాఖ్యలు:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

బాగా వ్రాశారు.

hanu చెప్పారు...

bagumdi nestam, mee kavitwam

అంకుర్ చెప్పారు...

@భావనిక్షిప్త
నా కవితపై మీ స్పందనకి క్రుతజ్ఞతలు ...

అంకుర్ చెప్పారు...

హను
నా కవితపై మీ స్పందనకి క్రుతజ్ఞతలు ...

రాధిక చెప్పారు...

very nice :-)

అంకుర్ చెప్పారు...

@radhika

Thanks for your response.

Revanth చెప్పారు...

baavundandi... sirivennela gaari style aa