నా జీవితాన్ని ఓ
నందనవనం చేసి నిన్ను అందులో
కొలువుంచాలనుకున్నా...
నేస్తమా! నువ్వు
నమ్మినా నమ్మకపోయినా
నేన్నిన్నునమ్మాను
నేను నీ గురించి
అంతా తెలుసుకుని ప్రేమిస్తే
అది ప్రేమవుతుందని
నేననుకోను.. వ్యాపారం అవుతుంది
వ్యాపారంలో లాభ నష్టాలే కాని
అనురాగాలకి, అనుబంధాలకి తావుండదు
నువ్వు ఇంకొకరిని ప్రేమించానన్నావు
ఈ సమాధానం నాకు నచ్చింది
నిన్ను మరవాలంటే
ఇదొక్కటి చాలు నాకు
కాని సమయం పడుతుంది
ప్రేమకైన, పెళ్లికైనా, జీవితాన్కైనా
నమ్మకం తొలిమెట్టు
అదిలేని జీవితం ఎంత గొప్పదైనా
" ఇట్ ఈజ్ నథింగ్"
నా జీవితం మొత్తం కూడా
నీ జ్ఞాపకాలతో
బ్రతికే ధైర్యం నాకుంది
అది నిన్ను ప్రేమించడం వల్లే వచ్చిందేమో..
ప్రేమ నాకొక స్ఫూర్తి..
జీవితం నాకొక వరం..
ఆత్మవిశ్వాసం నా పెట్టుబడి..
పడిన కష్టం వృధా పోదు
ఓ కొత్త అనుభవాన్నిస్తుంది
ప్రపంచాన్నైనా జయించగాలనన్న
ఆత్మా విశ్వాసం నీ
మీద నే పెంచుకున్న ప్రేమే
ఇచ్చింది..
ఇప్పటికీ "నీ అందెల సవ్వడి గమకాల
సుస్వర సంగీత ధ్వనిలో
ఉషస్సును వెదుక్కుంటాన్నేను
నీ సుందర సుమధుర భాషణల
మళయమారుతంలో
అద్వైత సిద్ధిని అన్వేషిస్తాను "
3 వ్యాఖ్యలు:
good one...
very very nice,imkaa pogitive style baagumdi.
baavundhi.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి