శుక్రవారం 4 సెప్టెంబర్ 2009

పల్లవి తెలియని గీతం...

చినుకులతో.
చిరుజత కలిపిన చిరునవ్వై,
నా హృదయం
ఆశలు తెరిచిన హరివిల్లై,
మనసున స్వరాలూ మీటే,
తలపున వరాలై నాటే...

ఈ ఉదయం.
నీసడిలో, అలజడిలో,
కవ్వించే ఒరవడిలో,
పల్లవి తెలియని గీతం...

సుమశరమై, పరవశమై
అవధులు లేని అంబరమై,
పలికెను సుమధుర గీతం