గురువారం 9 జూలై 2009

పిచ్చితనం

సుప్రభాతం,
సుమధురగీత శ్రవణం
చిరకాలవాంఛల సమ్మిశ్రితం
ఈ భువన విజయపు కాలచక్రం
నాకేమీ తెలియదు
వేదన తప్ప
చిన్ని చిరునవ్వు కోసం నిరీక్షణ
ఏళ్ళతరబడి..
శ్రమ... బాహుబంధనంలో
మిగిలిపోయిన జ్ఞాపకం
'కామం', నాకిష్టమైన పాఠ్యంశం
*****
ఈ చీకటి రాతల వెతలు
అర్థం తెలియని మాటల ప్రతులు,
హృదయ స్పందనల ప్రతీకలు,
భావగార్భితపు చిత్తవ్రుత్తులు.
మలినం కాదు మనోవేదన
ఊహలకందని భావాలకర్థం
ఊహించడం చేతకానితనం