నాకు నచ్చిన పాట
సిరివెన్నెల సినిమాలో సీతా రామ శాస్త్రి గారు రాసిన
విధాత తలపున ప్రభవించినది….
ఇందులో నన్నేక్కువగా ఆకర్షించింది మొదటి చరణం:
ప్రాగ్దిస వీణియ పైన
దినకర మయూఖ తంత్రుల పైన
జాగ్రుత విహంగ తతులే
వినీల గగనపు వేదిక పైన
పలికిన కిల కిల స్వనముల స్వరజతి
జగతికి శ్రీకారము కాగ,
విశ్వకావ్యమునకిది భాష్యముగా..
ఇది తొలిసంధ్య వర్ణన.
ప్రాగ్దిస వీణియ పైన
దిక్కులనే వీణ పైన
దినకర మయూఖ తంత్రుల పైన
సూర్యుడి కిరణాలనే తీగెల పై
జాగ్రుత విహంగ తతులే
అప్పుడే లేస్తున్న పక్షులు
వినీల గగనపు వేదిక పైన
నీలాకాశం అనే వేదిక మీద
పలికిన కిల కిల స్వనముల స్వరజతి
పలికే కువకువల స్వరాలూ ఒక స్వర ప్రవాహమై
జగతికి శ్రీకారము కాగా
ప్రపంచానికి శ్రీకారం అవుతున్నై
విశ్వకావ్యమునకిది భాష్యముగా..
విశ్వం అనే కావ్యానికి భాష్యంగా..
ఇక రెండో చరణం:
జనించు ప్రతి శిశు గళమున పలికిన
జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున
అనంత జీవన వాహినిగా..
సాగిన సృష్టి విలాసమిది
పుట్టే ప్రతి శిశువు గొంతులోంచి పుట్టే ఏడుపు
జీవనానికి నాందీ వాచకం
ఆది హృదయమనే మృదంగం వినిపించే మొదటి స్పందన
అలాంటి నాదం అనాది రాగమైన ఓంకారంతో మమేకమై
ఆదితాలంలో అనంతమైన జీవధారగా ప్రవహిస్తుంటే
సాగుతున్న సృష్టి విధానం ఇది
విరించినై విరచించితిని
ఈ కవనం
విపంచినై వినిపించితిని
ఈ గీతం
విరించి (సృష్టికర్త - బ్రహ్మ) అయి ఈ సాహిత్యాన్ని రచిస్తున్నా
విపంచి (కోకిల) అయి ఈ గీతాన్ని వినిపిస్తున్నా...
8 వ్యాఖ్యలు:
ఈ పాట చాలా బావుంటుంది. ఐతే మొదటిసారి దాని అర్ధం తెలిపారు. చాలా బావుంది.
janinchu prathisishu galamuna palikina jeevananaada tarangam
chetana pondina spandana dhvaninchu hrudayamrudangadhvanam...:2:
anaadiraagam aadi talamuna anantha jeevana vaahini gaa..
saagina srushti vidhaanamu ne,,,
virinchinai...
naa uchwasam kavanam naa nishwasam gamanam....
sarasaswarasurajhareegamanamavu samaveda saramidi...
nepaadina jeevana geetham...ee geetham..
wonderful song.
meekE kAdu sirivennela abhimaaniga nAku nacina pATa kuDA
బాగుంది. ఇది నాకు కూడా బాగా నచ్చిన పాట.
@anveshi..
మీ ప్రతిస్పందనకి ధన్యవాదాలు.
మీరు ఇక్కడ రెండో చరణం రాసారు.
పాతను కూడా పూర్తి చేసారు.
ఈ చరణం అర్థం కూడ వ్రాస్తాను..
@raj
మీ ప్రతిస్పందనకి ధన్యవాదాలు.
@subrahmanya chaitanya maamidipudi
మీ ప్రతిస్పందనకి ధన్యవాదాలు.
నేను పాటని పూర్తిగా వ్రాయలేదు.
తప్పకుండా మిగతాది కూడా వ్రాస్తాను
anna a song nakkuda ishtam.dani artham chala baga rasav
అర్ధం అంతా ఇంచు మించు సరిగ్గానే వుంది . ప్రాగ్దిశ అంతే తూర్పు. :)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి