ఒక శాస్త్రిగారికి వాల్లావిడకి తమలపాకులో సున్నం కోసం జరిగిన సంభాషణ:
శాస్త్రి గారు వాల్లావిడ్ని ఎగతాళి చేస్తూ సున్నం అడిగారు ఆశువుగా పద్య రూపంలో;
పర్వత శ్రేష్ట పుత్రిక పతి విరోధి
అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి
పేరుకు తగన్నట్టి పెద్దబిడ్డ
సున్నమిప్పుడు తేగదే సన్నుతాంగీ!
అర్థం: పర్వత శ్రేష్ట పుత్రిక అంటే హిమవంతుని కుమార్తె - పార్వతి. ఆమె పతి శంకరుడు, అతని విరోధి మన్మధుడు, అతడి అన్న బ్రహ్మ, అతడి భార్య సరస్వతీ దేవి, ఆమె అత్త లక్ష్మీ దేవి, ఆమె తండ్రి సముద్రుడు, అతని పెద్ద కుమార్తె జ్యేష్టాదేవి అంటే దరిద్ర దేవత. ఓ దరిద్రదేవతా సున్నం తీసుకురా" అని అడిగారు శాస్త్రి గారు. మరి ఆ ఇల్లాలు ఎలా బదులిచ్చిందో అదీ చూద్దాం:
శతపత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైది వైరి సున్నంబిదిగో
అర్థం: శతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు, అతని కొడుకును (కర్ణుడు) చంపిన వాడు అర్జునుడు, అర్జునుడి బావ శ్రీ కృష్ణుడు, శ్రీ కృష్ణుని సూనుడు (మనవడు) మన్మధుడు. అతని మామ చందమామ, అతన్ని నిత్యం ధరించే వాడు పరమ శివుడు, శివుని కుమారుడు విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుని వాహనం ఎలుక, దాని శత్రువు పిల్లి, పిల్లి శత్రువు కుక్క. ఓ కుక్కా సున్నం తీసుకో అని బదులిచ్చింది ఆ ఇల్లాలు.
1 వ్యాఖ్యలు:
అన్వేషి గారూ!!
మొదటి పద్యం లో కొన్ని పదాలు మారిపోవటమో, ఎగిరిపోవటమో జరిగినట్టున్నయి.'పెద్ద కూతురు ' ప్రస్తావన కనిపించటం లెదు, యతి, ప్రాస, గణ విభజనలు సరిపోవటం లెదు కదా..
రెండవ పద్యం పాదాల సవరణ తో
శతపత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైది వైరి సున్నంబిదిగో
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి